ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా అయ్యింది. అందులో ఒకటి తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు జరిగాయి, చాలా మంది తమ ప్రాణాలను విడిచి అమరులైనారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముందు ఉండి నడిపించారు. దానికి క్రుతజ్ఞతగా తెలంగాణా ప్రజలు కే.సి.ఆర్ గారిని తెలంగాణ మొదటి ముఖ్య మంత్రిగా ఎన్నుకున్నారు.
హైదరాబాద్ తెలంగాణకు గుండె లాంటిది. ఇక్కడ మేయర్ ఎన్నికలు దగ్గరికి రావడంతో తనకు ఉన్న పదవిని వాడుకొని మేయర్ ఎన్నికల్లో గెలవటానికి కే.సి.ఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ..............
1. ప్రత్యేక తెలంగాణ యేసు (Jesus) వల్లనే వచ్చింది అనడం.
2. మైనారిటీల రిజర్వేషన్
3. పేద క్రిస్టియన్స్ ని యస్.సి లలో కలపడం.
4.10 కోట్ల ఖర్చుతో చర్చ్ నిర్మాణం.
5.అవసరం లేకున్నా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచడం.
ప్రత్యేక తెలంగాణ కోసం 1300 మంది ప్రాణత్యాగం చేసారు అని ఇంతకు ముందు అసెంబ్లీలో అన్ని సార్లు చెప్పి ఇప్పుడు యేసు వల్ల వచ్చింది అనడంలో అసలు విషయం ఏంటి. ఒకవేళ యేసు వల్లనే వచ్చివుంటే మరి అంత మంది ఎందుకు చనిపోయారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అప్పుడు చనిపోలేదు, ఇప్పుడు మీ మాటల వల్ల చనిపోయారు.
మైనారిటీల రిజర్వేషన్ను 12% కి పెంచుతాను అని ప్రకటించాడు. తెలంగాణలో 7% ఉన్న మైనారిటీలకు 12% ఇస్తే మరి మిగతావాళ్ళకి ఎలా ఇస్తారు రిజర్వేషన్లు. తెలంగాణ లో బి.సి, యస్.సి, యస్.టి, మైనారిటీలు కాకుండా మిగితా కులాలకు చెందిన వాళ్ళు 20% ఉన్నారు. మరి వాళ్ళ పరిస్తితి ఏంటి.
పేద క్రిస్టియన్స్ ని యస్.సి. లలో కలపడం ఎందుకు. దీని వల్ల మత మార్పిడి పెరుగుతుంది అని తెలియదా.
10 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో చర్చ్ నిర్మించడం ఎందుకు. క్రిస్టియన్స్ కి ఇప్పుడు చర్చ్ లు లేవా లేక మిమ్మల్ని అడిగారా వాళ్ళు మాకు చర్చ్ కావలి అని. ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఫీజు కి ఇవ్వటానికి ఆలోచించే మీకు విద్యార్థుల చదువుల కంటే మందిరాలే ఎక్కువా.
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను పెంచావు బాగానే ఉంది. కాని వాళ్లకు ఇప్పుడు ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదా. ఒకవేళ సరిపోకనే వాళ్ళు లంచాలు తెసుకుంటున్నారు అంటే మీరు వేతనాలు పెంచారు కాబట్టి ఇప్పుడు తీసుకోవడం మానేస్తారా.
ఇలాంటి చాలా ప్రశ్నలు ఇప్పుడు ప్రజలలో ఉన్నాయీ. మరి వాటన్నింటికి కే.సి.ఆర్. గారు ఎలా సమాధానం ఇస్తాడో వేచి చూడాలి.

Comments