వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడు అభిమానులు ముద్దుగా పిలుచుకునే ' మెగా ప్రిన్స్ ' ,
నాగబాబు నట వారసుడిగా " ముకుంద " సినిమాతో తెరంగేట్రం చేసి ఓ మోస్తరు విజయాన్ని
తన ఖాతాలో వేసుకున్నాడు .
" ముకుంద " రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోగానే , అతని రెండో సినిమా ఫై చర్చ మొదలైంది , మెగా స్టార్ " చిరంజీవి " సూచనా మేరకు వరుణ్ తేజ్ రెండో సినిమా డాషింగ్ డైరెక్టర్ ' పూరి జగన్నాధ్ ' తో సినిమా ఉంటుందని ఫిలిం నగర్ టాక్ . వరుణ్ తేజ్ అభిమానులు మాత్రం చాలా ధీమాగా, సంతోషంగా ఉన్నారు ,తమ హీరో రెండో సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . ఎందుకంటే గత మెగా హీరోల రెండో సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ చిత్రాలే కాబట్టి , వరుణ్ తేజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని ' ఆతని అభిమానులు ఆశిస్తునారు .
పవన్ ని మొదలు నిన్న మొన్నటి అల్లు శిరీష్ దాక అందరికి రెండో సినిమా సూపర్ హిట్టే , పవన్ కి గోకులం లో సీత , చరణ్ ' మగధీర ' , అల్లు అర్జున్ ' ఆర్య ' శిరీష్ ' కొత్తజంట ' ఇలా ప్రతి మెగా హీరో కి హిట్టే , మరి ఈ సెంటిమెంట్ నే వరుణ్ తేజ్ ఫాలో అవుతాడో లేదో చూద్దాం మరి ......!
Comments