బెల్లంకొండ సురేష్ భారీ చిత్రాల నిర్మాత , ఆయన తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ మద్య వచ్చిన " అల్లుడు శీను " సినిమా తో తెరంగేట్రం చేసాడు , ఆ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయింది . మొదటి సినిమానే వి . వి .వినాయక్ , సమంతా & తమన్నా , దేవి శ్రీ ప్రసాద్ లాంటి స్టార్స్ తో పని చేయగలిగే అదృష్టం దక్కిచుక్కున్నాడు , ఇక రెండో సినిమా ఎలాగో మాస్ డైరెక్టర్ " బోయపాటి శ్రీను " చేతిలో పడ్డాడు , మంచి లవ్ మాస్ వస్తుంది అని అందరు అనుకున్నారు , కాని తాజా సమాచారం ప్రకారం రెండో సినిమా బోయపాటి తో లేదని తెలుస్తుంది . కారణం బోయపాటి శ్రీనివాస్ తో బిగ్ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసాడంట , కాని బెల్లంకొండ సురేష్ మాత్రం లో బడ్జెట్ మూవీ అయితే నే సేఫ్ అనే ఆలోచనలో ఉన్నాడు .
తమిళ్ లో హిట్ అయిన " సుందర పాండియన్ " ని తెలుగు లో రీమేక్ చేయాలనీ అనుకుంటునారు , ఆ సినిమా హక్కులని డైరెక్టర్ ' భీమినేని శ్రీనివాస రావు ' కొనుకున్నాడు కాబట్టి ఆ మూవీ ని కూడా భీమినేని నే డైరెక్ట్ చేస్తాడు , ఈ తెలుగు రీమేక్ కి " సుందర్ అండ్ కో " టైటిల్ పరిశీలన లో ఉన్నట్లు తెలుస్తుంది , చూడండి ఏం జరుగుతుందో ....
Comments