సినిమా : బందిపోటు
విడుదల తేదీ : 20 ఫిబ్రవరి 2015
నటీనటులు : అల్లరి నరేష్, ఈశ, సంపూర్నేష్ బాబు తదితరుల.
చాయాగ్రహణం : పి జి విందా
సంగీతం : కళ్యాణ్ కోడూరి
నిర్మాత : నరేష్ ఈదర – రాజేష్ ఈదర
దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
అల్లరి నరేష్ 'అల్లరి' సినిమా తో తెరంగేట్రం చేసి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ లో మంచి నటుడిగా స్థానం సంపాదించుకున్నాడు. గత కొన్ని సినిమాల నుంచి నరేష్ ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు. 'బ్రదర్ ఆఫ్ బొమ్మలి' తో పర్వాలేదు అనిపించుకున్న విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు.మరోసారి తన సినిమాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడానికి చేసిన మరో విభిన్న ప్రయత్నమే ‘బందిపోటు’. ‘దొంగలని దోచుకో’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. విభిన్న చిత్రాల దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకి డైరెక్టర్. చాలా కాలం తర్వాత ఈవివి సినిమా బ్యానర్ పై నిర్మించిన చిత్రం ఈ బందిపోటు .మరి ఈ బందిపోటు ప్రేక్షకుల మనసులని ఎంతవరకు దోచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
కథ :
హీరో విశ్వ(అల్లరి నరేష్) సోసైటిని దోచుకునేవల్ల దగ్గర మన హీరో దోచుకోవడం ఇతని పని. విశ్వ గురించి తెలుసుకున్న జాహ్నవి(ఈశ) ఒక రోజు విశ్వని కలిసి తన సమస్యల గురించి చెప్పి, సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న మకరంద్రరావు(తనికెళ్ళ భరణి) – శేషగిరి(రావు రమేష్) – భలే బాబు(పోసాని కృష్ణమురళి)లను మోసం చేసి వాళ్ళని నుంచి అందినంతా డబ్బు దోచుకోమని కోరుతుంది. జాహ్నవి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న విశ్వ తను చెప్పిన పని చేయడానికి ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి సొసైటీలో ఎంతో పలుకుబడి ఉన్న ఈ ముగ్గురినీ ఎలా మోసం చేసాడు.? వాళ్ళ దగ్గర నుంచి ఎంత దోచుకున్నాడు.? అలాగే వాళ్ళని ఎలా రోడ్డు మీదకి లాగాడు.? అనేది కథ . మరి హీరో వాళ్ళని దోచుకోవడానికి ఎం చేసాడు, ఎలా చెడు అనే ఆసక్తికర విషయాలను మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోండి.
ప్లస్ పాయింట్స్ :
- అల్లరి నరేష్
- సంపూర్నేష్ బాబు
- శ్రద్ధ దాస్ స్పెషల్ సాంగ్
- సినిమాటోగ్రఫీ
- సంగీతం
- రొటీన్ కథ
- స్క్రీన్ ప్లే
- కామెడీ
టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇద్దరి గురించి వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరి మరియు సినిమాటోగ్రాఫర్ పిజి విందా. సినిమాటోగ్రాఫర్ పిజి విందా సినిమాలో అల్లరి నరేష్ ఈశ లను చాల అందంగా చూపించాడు, ప్రతి ఫ్రేమ్ ని చాలా జాగ్రతగా తీసాడు . అల్లరి నరేష్ – ఈశలను సాంగ్స్ లో చాలా బాగా చూపించాడు. ఇక ఈ బ్యూటిఫుల్ విజువల్స్ కి కళ్యాణ్ కోడూరి మ్యూజిక్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. కళ్యాణ్ కోడూరి అందించిన ఆల్బం పెద్ద సక్సెస్ అయ్యింది. ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల సినిమా నిదివి పై ఇంకాస్త కేర్ఫుల్ గా ఉంటే బాగుండేది.
ఇక ఈ సినిమా దర్శకుడు కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ ప్రతిసారి డిఫరెంట్ కథలను డైరెక్ట్ చేసి బోర్ కొట్టిందేమో, ఈ సారి రొటీన్ కథతోనే కానిచ్చేసాడు , స్క్రీన్ ప్లే కూడా చాల స్లో గా వెళ్తూ ఉంటుంది. ఈ సినిమాలో మోహన కృష్ణ గారు రాసిన కొన్ని డైలాగ్లు పేలాయి. చాలా గ్యాప్ తరువాత ఈ వి వి సినిమా బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం పై నిర్మాతలు నరేష్ , రాజేష్ చాలా కేర్ తీసుకున్నారు.
తీర్పు :
అల్లరి నరేష్ కెరీర్ లో మొదటి సారి తను చేసిన ఒక డిఫరెంట్ మూవీ ‘బందిపోటు’. ఈ సినిమా మీకు ఓ సరి కొత్త అల్లరి నరేష్ ని పరిచయం చేస్తుంది. నరేష్ అన్ని సినిమాల్లో లాగా ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా కాకపోయినా ఓ సారి చూడొచ్చు.
ఐ న్యూస్ బజ్ . కామ్ రేటింగ్ : 1.75/5
Other website reviews :
Tupaki.com : 2.25/5
Mirchi9.com : 2.5/5
123telugu.com : 3/5
Idlebrain.com : 3.25/5
Comments