సినిమా : టెంపర్
విడుదల తేదీ : 13-02-15
తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, పోసాని తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్
బ్యాక్ గ్రౌండ్ : మణిశర్మ
ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్
చాయాగ్రహణం: శ్యాం కే నాయుడు
కథ : వక్కంతం వంశీ
నిర్మాత: బండ్ల గణేష్
దర్శకత్వం : పూరి జగన్నాధ్
జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఆంధ్రావాల తర్వాత దాదాపు పది ఏళ్ళ తర్వాత వచ్చిన సినిమా 'టెంపర్'. గత కొన్ని సినిమాల వరకు ఎన్ టి ఆర్,పూరి నుంచి ఆశించిన స్థాయిలో హిట్ సినిమా రాలేదు,ఇలాంటి సమయంలో టెంపర్ హిట్ వీళ్ళ ఇద్దరికీ ఎంతైనా అవసరం,మరి ఈ సినిమా వారికి హిట్ ఇచ్చిందో లేదో చూడడం పదండి.
కథ :
దయా – వాడికి లేనిదే అది.. ఇక కథలోకి వస్తే.. దయ(ఎన్.టి.ఆర్) అమ్మ నాన్న లేని ఓ అనాధ. పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓ సంఘటన ద్వారా దయకి చిన్నప్పుడే ఏం చేస్తే తన బలుపుకు తగ్గా పోస్ట్ లో ఉంటూనే డబ్బుకు కొదవ ఉండదో అలాంటి ఉద్యోగమే పోలీస్ డిపార్ట్ మెంట్ అని తెలుసుకొని పోలీస్ అవుతాడు. ట్రైలర్ లో చెప్పినట్టు పేరుకే పోలీస్ కానీ ఫుల్లీ కరెప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్ మెంటాలిటీ ఉన్న పోలీస్. డబ్బుకోసం గుండాలతో దోస్తీ చేసే మన దయకి, ఆ సిటీలో పెద్ద గుండా వాల్తేర్ వాసు(ప్రకాష్ రాజ్) తో పరిచయం, ఇక అక్కడి నుంచి వాడు చేసే అక్రమాలకు సపోర్ట్ గా నిలుస్తాడు. అదే టైంలో దయ అందమైన (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు.
అదే టైంలో దయ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి.మరి ఆ సంఘటనలు ఏంటి..? దయా ఆ తరువాత ఎం చేసాడు ...? అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఎన్ టి ఆర్ నటన
కోర్ట్ సీన్
మ్యూజిక్ & బ్యాక్ గ్రౌండ్
పూరి రాసిన కొన్ని డైలాగ్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కథ
ఫస్ట్ హాఫ్
ఎంటర్టైన్మెంట్
సాంకేతిక వర్గం :
అనూప్ సంగీతం తెరపై చూస్తున్నపుడు బాగానే ఉంది, ఇక మణిశర్మ ఎప్పటిలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. ఎస్ ఆర్ శేకర్ ఎడిటింగ్ బాగానే ఉంది,శ్యాం కె నాయుడు ఛాయాగ్రహణం బాగుంది.ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పూరి జగన్నాధ్ ఇంకో మెట్టు పైకి ఎక్కాడు,ఆయన రాసిన కొన్ని డైలాగ్స్ బాగానే పేలాయి.
చాలా గ్యాప్ తరువాత ఎన్ టి ఆర్,పూరి జగన్నాధ్ లు ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నారు .ఫ్యామిలీ ఆడియన్స్ అలరించే సినిమా కాదు,కాని మాస్ ప్రేక్షకులని బాగానే అలరిస్తుంది.
చివరగా : పర్ఫెక్ట్ పైసా వసూల్ కమర్షియల్ ఎంటర్టైనర్
ఐ న్యూస్ బజ్ . కామ్ రేటింగ్ : 3/5
Other website reviews :
Apherald.com : 3/5
Tupaki.com : 3.25/5
Idlebrain.com : 3.5/5
Mirchi9.com : 3.5/5
Ttimenews.com : 4/5
Comments