తెలుగు సినిమా మళ్లీ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది , గత ఏడాది కాలంగా తెలుగు సినిమా ఇలాంటి విశాధాలెన్నో వెంటాడుతూనే ఉన్నాయి. ప్రముఖ హాస్య నటుడు ఎమ్. ఎస్. నారాయణ ఇక లేరు. 1951, ఏప్రియల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు అనే గ్రామంలో పుట్టి రచయితగా మారి ఆ తరువాత నటుడిగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న మైలవరపు సూర్య నారాయణ ఈ రోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం తెలుగు సినిమాకి ఒక తీరని లోటు.
700 సినిమాలలో నటించి మెప్పించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే 5 నంది అవార్డులు కోద్ద గెలుచుకున్నారు.
నటుడిగా ఆయన మొదటి సినిమా ఎమ్ ధర్మరాజు ఎమ్ ఏ నుండి ఎన్నో వందల పాత్రలను నటించి , మెప్పించడమే కాకుండా ఈ మధ్యే గిన్నిస్ బుక్ కు కూడా ఎక్కిన ఎమ్ ఎస్ నారాయణ చనిపోవడంతో తెలుగు సినిమా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఆయన మరణం సినీ, కళారంగానికి తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ఆర్ అన్నారు. ఎం.ఎస్. కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుబూతి తెలిపారు.
For English click here: Comedian MS Narayana is no more.
Comments