సినిమా : ఐ (మనోహరుడు)
తారాగణం: విక్రమ్, అమీ జాక్సన్, సురేష్ గోపి, సంతానం, తదితరులు.
ఎడిటింగ్: లెనిన్ అంటోనీ
చాయాగ్రహణం: పి సి శ్రీరామ్
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
నిర్మాత: ఆస్కార్ రవిచంద్రన్, డి రమేష్ బాబు.
దర్శకత్వం : శంకర్
విక్రమ్, శంకర్ రెండో సారి కలసి చేసిన సినిమా "ఐ" భారి అంచనాలతో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాపై ఇన్ని అంచనాలు ఉండటానికి కారణం ఈ సినిమా ట్రైలర్. ట్రైలర్ తో అందర్నీ ఆకర్షించాడు శంకర్. ఇక ఇద్దరి వీరి ఇద్దరి కలయిక లోనే అపరిచితుడు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి ఇంకా చాలా మంచి సినిమా వస్తుందని ఆశే ఈ సినిమాపై ఇన్ని అంచనాలను పెంచింది. మరి విక్రమ్ ఆ అంచనాలను అందుకున్నదో, లేదో చూద్దాం .....!
కథ :
విక్రమ్ ఈ సినిమాలో ఓ గ్రామీణ యువకుడు, అతడికి ఓ కల ఉంటుంది . అదేంటంటే ఎలాగైనా తను "మిస్టర్ ఆంధ్ర" అవ్వాలని తలపిస్తూ ఉంటాడు, ఆ దారిలోనే తన ప్రయత్నాలు సాగుతాయి. ఇలాంటి టైం లోనే విక్రమ్ టాప్ మోడల్ అయిన అమీ ని చూస్తాడు. తను కూడా అలా పెద్ద మోడల్ అవ్వాలని కలలు కంటాడు. ఆ తరువాత విక్రమ్ మోడల్ అవ్వటానికి ఏం చేసాడు, ఆ తరువాత అతని ఏం చేసాడు అనేది కథ.కథనం :
విక్రమ్ మోడల్ అవ్వాలన్న ఆశ, విక్రమ్ ని బాడీ బిల్డింగ్ చేసేలా చేస్తుంది. ఇందులో విక్రమ్ చేసే నటన, అతని వేశాదరణ, గెట్ అప్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. మొదటి బాగం కొద్దిగా లాగినట్టు అనిపించినా, ద్వితియార్థం బాగానే ఉంటుంది. ఈ సినిమా కథనం శంకర్ గత చిత్రాల్లాగే కొద్దిగా స్లో గా వెళుతుంది.నటి నటులు :
నటినటులు అంటే సినిమాలో విక్రమ్ నటనే ప్రాదాన్ ఆకర్షణ, ఇక అమీ జాక్సన్ అందాలూ కుర్రకారు ని మతి పోగొట్టేల చేస్తుంది, ఇందులో ప్రతినాయకుడిగా కనిపించిన సురేష్ గోపి ఉన్నంత లో పరవాలేదు అనిపించాడు, ఇక సంతానం రెగ్యులర్ గానే చేసాడు.సాంకేతిక విభాగం :
ఏ ఆర్ రెహమాన్ గురించి చెప్పుకుంటే పాటలు అంత గొప్పగా ఏమి లేవు, కాని బాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు. పి సి శ్రీరామ్ చాయాగ్రహణం సినిమాకి హైలైట్, ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే అని అనిపిస్తుంది. ఇక శంకర్ ఈ సినిమా ఎంత ప్రాణం పెట్టి చేసారో సినిమా చూస్తె తెలుస్తుంది. ఎడిటర్ బాగానే చేసాడు, ఇంకా కొద్దిగా కట్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది.ప్లస్ పాయింట్స్ :
విక్రమ్ నటన
యాక్షన్ పార్ట్
పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
మ్యూజిక్
సినిమా నిడివి
అక్కడక్కడ కథనం కొద్దిగా బోర్ గా ఉంటుంది .
చివరగా కొత్త సినిమా చూద్దాం అనుకునేవాళ్లు , ఈ సినిమా చూడొచ్చు . కాకపోతే కొన్నికొన్ని చోట్లా కొంచెం ఓపికగా ఉండాలి, కొన్ని సీన్స్ తప్ప మిగిలిన సినిమా చూడొచ్చు.
InewsBuzz.com రేటింగ్ : 3/5
Comments