పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరో, ఆయన పేరు వింటేనే ఎంతో మంది అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. ఇక పవర్ స్టార్ తాజా చిత్రం గోపాల గోపాల లో ఆయన ఒక దేవుడిగా దర్శనమిచ్చాడు, ఇక ఇది చూసిన కొంత మంది అభిమానులు ఆయన్ని నిజంగానే దేవుడిని చేసారు. ఆయన మీద చేసిన భజన పాటలు ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు 20 నిముషాలు ఉన్న ఈ పవన్ భజన వీడియోను కొందరు పవన్ వీరాభిమానులు యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘కళ్యాణ్ బాబు నీకున్న ఘనత పాడితే మాకు పండగే’ అనే చరణంతో మొదలైన ఈ పాటలో పవన్ సూపర్ హిట్ సినిమాల పాటల చరణాలను కలుపుకుంటూ భజనగా మార్చుకుని పవన్ కళ్యాణ్ ఫోటోలకు దండలు వేసి అగరావత్తులతో హారతులు ఇస్తూ భక్తి భావంతో పవన్ అభిమానులు తమ భక్తిని చాటుకుంటున్నారు.ఇక కొద్ది రోజుల ముందు ఒక వీరాభిమాని పవన్ కి విగ్రహం కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ ఈ వీడియో పై ఎలా స్పందిస్తాడో చూద్దాం.
For Video Click Here: Pawan kalyan - Bhakti Geetham
Comments