ధూమ్ సిరీస్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. అందులో హీరోలుగా అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా నటించారు. కాని ధూమ్ సిరీస్ లో హీరో పాత్ర కంటే ప్రతినాయకుడికి ఎక్కువ పేరు ఉంటుంది. అందుకనే దీనిలో రణభీర్ కపూర్, హృతిక్ రోషన్, చివరిదాంట్లో ఆమిర్ ఖాన్ ప్రతినాయకుడిగా చేస్తారు.
ఇప్పుడు ధూమ్ సిరీస్ లో నాలుగవ భాగం రాబోతుంది. దీనిలో ప్రతినాయకుడి పాత్రలో హృతిక్ రోషన్ చేస్తున్నట్టు సమాచారం. యష్ రాజ్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి డైరెక్టర్ గా విజయ్ క్రిష్ణ ఆచార్య పని చేస్తున్నాడు. ఇతను ఇంతకుముందు మూవీలకు స్టొరీ అందించాడు మరియు ధూమ్-3 కి డైరెక్టర్ గా పనిచేసాడు.
హృతిక్ రోషన్ ఇప్పుడు ఆశ్తోష్ గావరికర్ డైరక్షన్ లో మొహంజో దారో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2015లో విడుదల అవుతుంది. దాని తర్వాత ధూమ్-4 సెట్స్ పైకి వెళ్తుంది అని సమాచారం.

Comments