గోపాల గోపాల చిత్రం రెండు రోజుల క్రితం విడుదల అయ్యి అన్ని చోట్లా చాల బాగా ప్రదర్శింపబడుతుంది, ఈ సినిమా హిట్ అవ్వడానికి ఎంతో మంది సాంకేతిక నిపుణుల సహకారం చాల ఉంది, నటీనటుల ప్రదర్శన, సంగీత దర్శకుడి పనితనము, చాయాగ్రాహకుడి ప్రతిభ, దర్శకుడి ఆలోచన విధానం ఇలా అన్ని ఈ చిత్రానికి చాలా బాగా కుదిరాయి, కాని ఈ చిత్రానికి ఇంకో పెద్ద బలం, ఈ చిత్రం లోని మాటలు, సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలని అందించారు. ప్రతి సామాన్య వ్యక్తిని ఆలోచింపచేసే విదంగా ఇందులో సంభాషణలను సాగుతాయి. అందులో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం.
1.బల్లలు బద్దలవుతాయ్ ఇక్కడ- 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ
2.లాయర్లకు కేసులంటే సూట్ కేసులే-పవన్
3.వేగం బండి నడిపే వాడి నరాల్లో ఉంటుంది-పవన్
4.దారి చూపడం నా పని.. గమ్యం చేరడం నీపని-పవన్
5.నమ్మినోడ్ని మోసం చేయడం తప్పు.. మోసాన్ని నమ్మడం ఇంకా తప్పు-వెంకీ
6.ఫీజు తీసుకునే వాడి కన్నా ఫెయిన్ తీసుకున్న వాడి మాటకు పదునెక్కువ-లాయర్
7.కత్తితో కాదు.. భక్తితో బెదిరిస్తున్నారు.. నమ్మకాన్ని అమ్మకంగా మార్చేస్తున్నారు-వెంకీ
8.మనిషి మతాన్ని బతికిస్తుంటే… మతం మనిషిని చంపుతుంది-వెంకీ
9.మనిషి రాయిని దేవుడు చేస్తుంటే… మనిషిని మనిషిని చేయమనండి చూస్తా-వెంకీ
10.గాల్లోంచి ఉంగరాలు కాదు.. ల్యాప్‌ట్యాప్‌లు తీసి ఇవ్వండి చూస్తా-వెంకీ
11.ఇది నీ ఇల్లాలి ఇల్లు కాదు.. ఆ అమ్మాయి పుట్టిల్లు… నీ ఇళ్లే నీ ఇల్లాలి ఇల్లు- పవన్
12.ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు. దేవుడికి దగ్గరగా ఉండడం-పవన్
13.నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే మాట్లాడని అందరూ చచ్చిపోయారు.. భీష్ముడితో సహా.. అది తప్పన్న అశ్వత్థామ మాత్రం బతికిపోయాడు-పవన్
14.భూమి భరించాలి.. భూమి మీద బాధ్యతలేని వాడు బతికుండ కూడదు-పవన్
15.నాయకుడంటే నడిపించేవాడు-పవన్
16.యుద్ధానికి వెళ్లేవాడికి తెగువ కాదు.. తెలివి ఉండాలి-పవన్
17.సాధువు అంటే పూజలందుకునే వాడు కాదు.. ప్రతి జీవిలోను మనిషిని చూసేవాడు-వెంకీ
18.అతని పోరాటం పరమాత్ముడిమీద కాదు… స్వామిజీల పద్ధతి మీద- ఓ స్వామీజీ
19.నువ్వు చావుకు దగ్గరగా ఉన్నా.. నీలో కాన్ఫిడెన్స్ చావట్లేదు-పవన్
20.నువ్వు దన్నం పెట్టకపోయినా అన్నం పెట్టి ఆకలి తీర్చావు-పవన్
21.నేను కృష్ణుడు కాబట్టే మాయలు చేశాను.. మాయలు చేయడానికి కృష్ణుడు కాలేదు-పవన్
22.ప్రేమించిన అమ్మాయి కోసం చిన్న చిన్న తప్పులు చేయడం తప్పు కాదు స్వేచ్ఛ-పవన్
23.నువ్వు వాళ్ల వ్యాపారాన్ని దెబ్బతీశావు… నిన్ను వాళ్లు వ్యాపారంగా మార్చేశారు-పవన్
24.దేవుడ్ని స్వామీజీలతో కాదు నా కల్లోకి వచ్చి మాట్లాడమనండి-వెంకీ
25.ప్రజల బలహీనతను స్వామీజీలు క్యాష్ చేసుకుంటున్నారు-వెంకీ

Comments