గత రెండు చిత్రాలు 'స్వామి రారా' 'కార్తికేయ' లాంటి రెండు కొత్త కథలతో ఇండస్ట్రీ ని ఊపేసాడు, ఏకంగా 'కార్తికేయ' సినిమాకి 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు మళ్లీ అలాగే ఇంకో కొత్త కథతో "సూర్య వర్సెస్ సూర్య" అంటూ వచ్చేస్తున్నాడు. ఈ సినిమా కథలో హీరో నిఖిల్ కి ఒక జెనెటిక్ డిసీజ్ ఉంటుంది, అది ఏంటంటే అతడు మార్నింగ్ ఎండలో తిరగలేడు, అంటే అతను ఎండలో తిరిగితే ఇక చనిపోతాడు.
ఇందులో నిఖిల్ ఒక మాట చెప్తాడు నేను ఆ సూర్యుడిని చూస్తే ఆయన కొడుకు నా అంతు చూస్తాడు, ఈ డైలాగ్ వింటేనే తెలుస్తుంది నిఖిల్ పరిస్థితి ఏంటో. మరి ఇలాంటి పరిస్తితులలో అతను ప్రేమలో పడితే అతడు ఏం చేస్తాడు, ఇక చివర్లో భరణి గారు మన గజిని కే ఇద్దరు ఉన్నారు, అసిన్, నయనతార అంటూ ఈ టిసర్ సాగూతు పోతుంది. ఇలాంటి ఒక కొత్త కథ తో నిఖిల్ సినిమా మళ్లీ ఇండస్ట్రీ వర్గాలకి, ప్రేక్షకులకి ఎక్ష్పేక్టేషన్లు పెంచేసింది. "కార్తికేయ" సినిమాకి మంచి కెమెరా పనితనం చూపిచ్చిన "కార్తీక్ గట్టమనేని" ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు, ఇక ఈ సినిమాని మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు.

Comments