విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "గోపాల గోపాల" చిత్రం ఆడియో నిన్న జరిగింది. ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ 'అనూప్ రూబెన్స్' స్వరాలను సమకూర్చాడు. ఇప్పుడు ఈ సినిమా ఆల్బమ్ ఎలా ఉందొ ఓ సారి లుక్కేద్దాం పదండి.
మొదటి పాట : భాజే భాజే
రచన : అనంత శ్రీ రామ్
గానం : హరిచరణ్
"భాజే భాజే" అంటూ సాగే ఈ పాటని "హరిచరణ్ శేషాద్రి" పాడారు. లిరికల్ గా చూస్తే ఈ పాట "కృష్ణుడి" కి భజన పాట అని చెప్పొచు. ఇక ఈ పాటకి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం చాలా బావుంది. అనంత్ శ్రీ రామ్ ఈ పాటకి చాలా మంచి సాహిత్యని అందిచాడు.
రెండవ పాట : పిల్లి మనకు ఎదురుపడితే , పనులు ఏమి జరగవ
రచన : చంద్రబోసు
గానం : కైలాష్ ఖేర్
' పిల్లి మనకు ఎదురుపడితే, పనులు ఏమి జరగవ ' అంటూ మొదలు అయ్యే ఈ పాట. మన సామాన్య జీవితం లో మనం పాటించే మూడ నమ్మకాలను చెప్పారు. ఈ పాట ను"కైలాష్ ఖేర్" పాడారు, ఈ పాటకు చంద్రబోస్ గారు అందించిన సాహిత్యం శ్రోతలను చాలా బాగా ఆకట్టుకుంటుంది, ఈ పాట మాస్ కి కూడా బాగానే నచ్చుతుంది. "అనూప్" అందించిన ఈ పాట ఒరిజినల్ "గో గో గోవింద" పాటను అక్కడక్కడ గుర్తుకుతెస్తుంది.
మూడవ పాట : బ్రహ్మ లా నేనే నిన్ను సృస్తిచాననుకోన
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : సోను నిగమ్
"బ్రహ్మ లా నేనే నిన్ను సృస్తిచాననుకోన, బొమ్మ లా నువ్వే నన్ను పుట్టిన్చావ్ అనుకొన" అని సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాట వినే శ్రోతలను ఒక క్షణం ఆలోచనలో పడేస్తుంది. ఈ పాటను పాడిన 'సోను నిగమ్' చాలా అందంగా, మన తెలుగు తెలిసిన సింగర్ లా, సిరివెన్నెల గారు రాసినంత అందంగా పాడారు
ఈ మూడు పాటలు కాకుండా ఒక థీమ్ కూడా ఇందులో ఉంది. మొత్తం గా ఈ పాటలు విన్న తరువాత ఇది ఒక డీసెంట్ ఆల్బమ్ 'అనూప్ రూబెన్స్' మనం సినిమాతో ఒక మెట్టు పైకి ఎదిగాడు. ఇంకా ఈ "గోపాల గోపాల" తో అది ఇంకా ఎత్తు కి వెళ్లి పోయింది. ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు అనడానికి ఏ సందేహం అక్కర్లేదు.
ఈ ఆల్బమ్ కి inewsbuzz .com ఇస్తున్న రేటింగ్ : 3.5/5

Comments